Are you a member? Register / Login

 • అపుడు....మహేష్ బాబు టెన్షన్ పడ్డారు, వణికి పోయారు!

  17 September 2015

  హైదరాబాద్: ‘శ్రీమంతుడు' సినిమా విడుదలకు ముందు మహేష్ బాబు తన మనసులో ఆలోచన ఎలా ఉందో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వివరించారు. బాహుబలి లాంటి భారీ సినిమా తర్వాత వస్తున్న సినిమా కావడంతో తన చిత్రం సినిమా బాక్సాఫీసు వద్ద ఎలాంటి ఫలితాలు సాధిస్తుందో? అని ఆయన కాస్త ఆందోళన చెందారట. ఏదైతేనేం... సినిమా పెద్ద హిట్టయింది. శ్రీమంతుడు హిట్ ఇచ్చిన ఎనర్జీతో మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం' చిత్రానికి ఉత్సాహంగా సిద్ధమయ్యారు.

  View More

 • తేజ కామెంట్స్ వివాదం: మహేష్ బాబు స్పందించారు!

  17 September 2015

  హైదరాబాద్: ‘శ్రీమంతుడు' సినిమా ద్వారా మహేష్ బాబు ఒక మంచి మెసేజ్ జనాల్లోకి తీసుకెళ్లారు. డబ్బులు సంపాదించడం మాత్రమే కాదు... తమ సొంతూర్లను, వెనకబడిన గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి పరుచాలనే కాన్సెప్టును సినిమాలో చూపించడంతో పాటు, పలు గ్రామాలను స్వయంగా దత్తత తీసుకుని అభివృద్ధి చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. మహేష్ బాబు సినిమా చూసి ఇన్ స్పైర్ అయి పలువురు ప్రేక్షకులు, ఇతర స్టార్స్ కూడా గ్రామాలను దత్తత తీసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే దర్శకుడు తేజ మాత్రం మహేష్ బాబు చేస్తున్న ఈ పనులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. మహేష్ బాబు ఇన్ కం టాక్స్ తగ్గించుకోవడానికే గ్రామాలను దత్తత తీసుకుంటున్నారు, దేశాన్ని ఏదో ఉద్దరించడానికి కాదు, ఆయనకు అలాంటి ఉద్దేశ్యం ఉంటే శ్రీమంతుడు సినిమా వరకు ఆగే వాడు కాదు, ఒక్కడు సినిమా సమయంలోనే చేసే వాడు అంటూ వ్యాఖ్యానించారు. దీంతో మహేష్ బాబు అభిమానులు తేజ మీద భగ్గుమన్నారు.

  View More

 • బాలీవుడ్ ఛాన్స్: బికినీలో రెచ్చిపోనున్న రాయ్ లక్ష్మి

  17 September 2015

  హైదరాబాద్: అప్పట్లో బాలీవుడ్‌లో వచ్చిన ‘జూలీ' సినిమా గుర్తుందా?...ఈ సినిమా ద్వారా పాపులరైన హాట్ బ్యూటీ నేహా దుపియా. ఈ చిత్రంలో ఆమె నగ్నంగా నటించి అందరినీ ఆశ్చర్య పరిచింది. రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు సీక్వెల్ గా ‘జూలీ 2' రాబోతోంది. అయితే ఈ సినిమాలో నేహా దూపియా నటించడం లేదు. దీంతో ఈ అవకాశం సౌతిండియా హాట్ బ్యూటీ లక్ష్మీ రాయ్‌కి దక్కింది. ఈ సినిమా తర్వాత బాలీవుడ్లో తనకు మంచి అవకాశాలు వస్తాయని భావిస్తోంది లక్ష్మీ రాయ్.

  View More

 • రజనీ \'కబాలి\' : ఫస్ట్ లుక్ విడుదల (ఫొటోలు)

  17 September 2015

  చెన్నై : రజనీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'కబాలి' ఫస్ట్ లుక్ వచ్చేసింది. వినాయిక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ ఫస్ట్ లుక్ ఈ రోజు సాయింత్రం విడుదల చేసారు దర్శక,నిర్మాతలు. ఆ ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని ఇక్కడ చూడండి.

  View More

 • సాయి ధరమ్ తేజ, అనీల్ రావిపూడి చిత్రం టైటిల్

  17 September 2015

  'సుబ్రమణ్యం ఫర్ సేల్' విషయానికి వస్తే.... ''ఇప్పటివరకూ కథనే నమ్ముకొని సినిమాలు తీశాం. 'సుబ్రమణ్యం ఫర్ సేల్' కూడా చక్కని కథతో రూపొందనున్న సినిమా. హరీశ్ శంకర్‌తో నేను తీసిన 'రామయ్య వస్తావయ్యా' అనుకున్న స్థాయి విజయాన్ని అందుకోలేదు. అయినా... అతని ప్రతిభపై ఉన్న నమ్మకంతో ఈ సినిమా చేస్తున్నాను. ఈ సినిమాతో సాయిధరమ్‌తేజ్ స్టార్ హీరో అవుతాడు'' అని 'దిల్' రాజు అన్నారు. అలాగే ..'దిల్' రాజు మాట్లాడుతూ - ''సాయిధరమ్‌తేజ్ నటించిన సినిమా ఏదీ విడుదల కాకముందే... అతను హీరోగా సినిమాను ప్రారంభించామంటే... అతనిపై, హరీశ్‌శంకర్ కథపై మాకున్న నమ్మకాన్ని అర్థం చేసుకోవచ్చు. '' అని తెలిపారు. '''మిరపకాయ్' టైమ్‌లోనే ఈ టైటిల్‌ని మీడియాకు తెలియజేశాను. అప్పట్నుంచీ ఈ కథపై కసరత్తులు చేస్తూనే ఉన్నాను. అయితే... ఎవరితో చేయాలనేది మాత్రం క్లారిటీ లేదు. 'గబ్బర్‌సింగ్' టైమ్‌లో పవన్‌కల్యాణ్‌గారితో సాయిధరమ్‌తేజ్‌ని చూశాను. తొలి చూపులోనే నచ్చేశాడు. 'పిల్లా నువ్వులేని జీవితం' ప్రోమోస్ చూశాక నా సుబ్రమణ్యం ఇతనే అని ఫిక్స్ అయిపోయాను. సీత అనే పాత్రను రెజీనా చేస్తోంది. చాలా కొత్తగా ఉంటుందా పాత్ర. సంగీత దర్శకుడు మిక్కీ జె.మేయర్‌తో తొలిసారి పనిచేస్తున్నాను. ప్రతిభావంతులైన టీమ్ పనిచేస్తున్న వినోదాత్మక ప్రేమకథ ఇది'' అని హరీశ్‌శంకర్ తెలిపారు. సాయిధరమ్‌తేజ్‌. సుమన్‌, కోట శ్రీనివాసరావు, నాగబాబు, రావు రమేశ్‌, పృథ్వీ, ప్రభాస్‌ శ్రీను తదితరులు నటించే ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జే. మేయర్‌, ఫొటోగ్రఫీ: సి.రాంప్రసాద్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, స్క్రీప్లే: రమేశ్‌రెడ్డి, సతీశ్‌ వేగేశ్న, తోట ప్రసాద్‌, సహ నిర్మాతలు: శిరీష్‌, లక్ష్మణ్‌, నిర్మాత: దిల్‌ రాజు, కథ, మాటలు, దర్శకత్వం: హరీశ్‌శంకర్‌ ఎస్‌

  View More

 • వచ్చేసింది : బాలయ్య \'డిక్టేటర్‌\' ఫస్ట్ లుక్ (ఫొటో)

  17 September 2015

  హైదరాబాద్ : లక్ష్యం,లౌక్యం చిత్రాల హిట్ దర్శకుడు శ్రీవాస్‌ తాజాగా డైరక్ట్ చేస్తున్న త్రం 'డిక్టేటర్‌'. నందమూరి బాలకృష్ణ హీరో. అంజలి, సోనాల్‌ చౌహాన్‌ హీరోయిన్స్. వేదాశ్వ క్రియేషన్స్‌, ఎరోస్‌ ఇంటర్నేషనల్‌ రూపొందిస్తున్నాయి. 'డిక్టేటర్‌'లో దాదాపు సగభాగం యూరప్‌ నేపథ్యంలోనే సాగుతుంది. పాటలూ, పోరాట ఘట్టాలనీ అక్కడే తెరకెక్కించారు. వినాయిక చవితి సందర్బంగా దర్శకుడు ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు. ఇక్కడ ఈ ఫస్ట్ లుక్ ని చూడండి.

  View More

 • బాలయ్య కోసం ప్రత్యేకంగా...., లుక్ అదిరిపోవాలంతే!

  17 September 2015

  హైదరాబాద్: బాలయ్య నటిస్తున్న 99వ సినిమా ‘డిక్టేటర్' సినిమా చివరి దశకు చేరుకుంది. వినాయక చవితి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి బాలయ్య ఫస్ట్ లుక్ విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో బాలయ్య గత సినిమాలకు భిన్నంగా మోస్ట్ స్టైలిష్ గా కనిపించబోతున్నారు. ఫస్ట్ లుక్ కోసం బాలయ్యను ప్రత్యేకంగా మేకోవర్ చేసారు. ఇందుకోసం ఈరోస్ సంస్థ ఇండియాలోనే టాప్ స్టైలిస్ట్స్, డిజైనర్లను ప్రత్యేకంగా పిలిపించారు. దర్శకుడు శ్రీవాస్ బాలయ్య లుక్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకున్నారట. బాలయ్య లుక్ సూపర్బ్ గా ఉండబోతోంది. ADVERTISEMENT ఈ చిత్రంలో అంజలి, సోనాల్‌ చౌహాన్‌ హీరోయిన్స్. ఎరోస్‌ ఇంటర్నేషనల్‌, వేదాశ్వ క్రియేషన్స్‌ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాను జనవరి 14 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. రీసెంట్ గా బాలకృష్ణపై హైదరాబాద్ లో ఇంట్రడక్షన్ సాంగ్ తీసారు. ఈ చిత్రంలో బాలకృష్ణని శ్రీవాస్‌ సరికొత్తగా ఆవిష్కరించబోతున్నారని, ఆయన గెటప్‌ వినూత్నంగా ఉండబోతోందని, ఆయన పలికే సంభాషణలు ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని పంచబోతున్నాయని చిత్ర దర్శకుడు చెప్తున్నారు.

  View More

 • చిరంజీవి 150: ఆ టైపు సినిమా చేసే ఆలోచన ఉందా?

  17 September 2015

  హైదరాబాద్: చిరంజీవి 150వ సినిమా గురించి గత కొంత కాలంగా తెలుగు సినీ సర్కిల్ లో ఆసక్తికరమైన చర్చ సాగుతూనే ఉంది. తొలి నాళ్లలో ఆయన దేశ భక్తి తరహా సినిమాలు చేస్తారని, సందేశంతో కూడిన సినిమాలు చేస్తారనే వాదన వినిపించింది. ఆ తర్వాత చిరంజీవి స్వయంగా స్పందిస్తూ అలాంటి సినిమాలు చేయడం లేదన్నారు. అభిమానులను అలరించే, పూర్తి స్థాయి ఎంటర్టెన్మెంట్, ఫుల్ కమర్షియల్ వాల్యూస్ తో ఉన్న సినిమా చేస్తానని స్వయంగా చిరంజీవి చెప్పుకొచ్చారు. కొన్ని రోజుల పాటు పూరి జగన్నాథ్ చిరంజీవి ఇమేజ్ కు తగిన విధంగా ఆటోజానీ సబ్జెక్టు తయారు చేసారు. అయితే ఎందుకనో పూరి తయారు చేసిన స్క్రిప్టు చిరంజీవిని పూర్తి స్థాయిలో సంతృప్తి పరచలేక పోయింది. అతనితో సినిమా రద్దయింది.

  View More

 • బాహుబలితో పోటీ పడుతుందా? ‘పులి’ సెన్సార్ రిపోర్ట్

  17 September 2015

  హైదరాబాద్: తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా ‘పులి' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈచిత్రం తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదల కాబోతోంది. అక్టోబర్ 1న సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాను ఇండియన్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ ‘బాహుబలి' రేంజిలో ఉంటుందని అంటున్నారు. అయితే నిర్మాతలు మాత్రం ‘పులి' సినిమా డిఫరెంటుగా ఉంటుందని అంటున్నారు. ADVERTISEMENT పిల్లలను, పెద్దలను, అభిమానులను అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా సినిమా ఉంటుందని అంటున్నారు. మరో వైపు ఈ సినిమాకు సెన్సార్ బోర్డు క్లీన్ ‘యు' సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో సినిమాకు ఫ్యామిలీ ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తుందని భావిస్తున్నారు.

  View More